గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (10:21 IST)

రైళ్లల్లో కర్పూరం వెలిగించకండి.. ఘోర అగ్ని ప్రమాదాలు తప్పవు.. రైల్వే శాఖ

శబరిమల అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయ్యప్ప స్వాములు రైలు ప్రయాణ సమయంలో పూజల పేరిట దీపం, హారతి కర్పూరం తదితరాలను వెలిగిస్తే.. కఠిన చర్యలు తప్పవని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది. రైళ్లలో నిప్పు వెలిగించే పట్టుబడితే రూ.1000 వరకు జరిమానా, మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం వుందని హెచ్చరించింది. 
 
శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్ళే రైళ్లలో ఎక్కిన తర్వాత భోగీలలో పూజలు చేసి, హారతుల పేరిట కర్పూరం వెలిగిస్తున్నట్లు ఫిర్యాదులు అందంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. కర్పూరం వెలిగించడం చేస్తే ఘోర అగ్ని ప్రమాదాలు జరుగుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇటీవల కోయంబత్తూరు మీదుగా వెళుతున్న స్పెషల్ రైలులో భక్తులు దీపం పెట్టడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వారిని మందలించి వదిలిపెట్టారు.