శబరిమలలో ఉద్రిక్తత.. మహిళలను అడ్డుకున్న మహిళలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్ప దర్శనానికి వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శబరిమల ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్ప దర్శనానికి మహిళా భక్తులు దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళా భక్తుల బృందం పంపా బేస్ క్యాంప్ చేరుకుంది. భక్తుల బృందంలో 20-50 ఏళ్ల వయస్సున్న మహిళలు ఉన్నారు.
దర్శనం కోసం వచ్చిన మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పంబలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అంతకుముందు కొట్టాయం రైల్వేస్టేషన్ వద్ద మహిళా భక్తులు నిరసన తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నెల 27వ తేదీ వరకు 144 సెక్షన్ పొడిగించారు. ఇళావుంగల్ సన్నిధానం మార్గంలో చట్ట విరుద్ధంగా గుమికూడదని హెచ్చరికలు జారీచేశారు. శబరిమల ఆలయ కార్యకలాపాలు పర్యవేక్షణకు కేరళ హైకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చిన నివేదికను కేరళ ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేయనుంది.