1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (09:05 IST)

తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్...

దేశ ఆర్థికమంత్రిగా పియూష్ గోయల్ నియమితులయ్యారు. అయితే, ఆయన ఈ విధులను తాత్కాలికంగానే నిర్వహిస్తారు. వచ్చే నెల ఒకటో తేదీన మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీంతో పియూష్ గోయల్‌ను తాత్కాలిక విత్తమంత్రిగా నియమించగా, ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
కాగా, ఆర్థిక శాఖామంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికితోడు ఆయన మృదుకణజాల కేన్సర్‌ సోకింది. దీనికి చికిత్స కోసం ఆయన న్యూయార్క్ వెళ్లారు. దీంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన చేశారు. ఈ కారణంగా తాత్కాలిక విత్తమంత్రిగా పియూష్ గోయల్‌ను నియమించారు.