సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (19:27 IST)

హైతీ తీరంలో ఓడ ధ్వంసం.. 17మంది మృతి.. ఒడ్డుకు చేరిన మృతదేహాలు

Haitian coast
హైతీ తీరంలో ఓడ ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. అన్సెలిటా అనే ఓడ బుధవారం సెయింట్-లూయిస్ డునార్డ్ కమ్యూన్ నుంచి టోర్టుగా ద్వీపం వైపు బయల్దేరింది. హైతీ తీరం సమీపంలో అకస్మాత్తుగా ధ్వంసమైంది. 
 
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది మహిళలు, ఇద్దరు పిల్లలతో సహా 17 మంది మృతి చెందారని హైతీ మారిటైమ్ అండ్ నావిగేషన్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఎరిక్ ప్రీవోస్ట్ జూనియర్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. 
 
గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. పోర్ట్-ఔ- ప్రిన్స్‌కు ఉత్తరాన 100 మైళ్ళు దూరంలోని తీరప్రాంత పట్టణమైన లే బోర్గ్నలో మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు ఇంకా గుర్తించలేదు.