గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మే 2023 (12:13 IST)

హాస్టల్‌లో ఘోర అగ్ని ప్రమాదం- 19మంది విద్యార్థులు సజీవదహనం

Fire accident
దక్షిణ అమెరికాలోని ఓ హాస్టల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. క్షణాల వ్యవధిలో హాస్టల్ భవనం చుట్టు మంటలు భారీ ఎత్తున ఎగసి పడ్డాయి. చూస్తూ ఉండగానే ఆ ప్రాంతమంతా  దట్టమైన పొగలతో నిండిపోయింది. 
 
అసలు ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 19మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పి.. అందుకులో చిక్కుకున్న పిల్లలను రక్షించారు. 
 
తీవ్రంగా గాయపడిన పిల్లలను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతులందరూ 12 నుంచి 18 ఏళ్ల వయస్సు గలవారని పోలీసులు తెలిపారు.