సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (10:04 IST)

బీభత్సం సృష్టించిన రాయ్ టైఫూన్ తుఫాను : 75 మంది మృతి

ఫిలిప్పీన్స్ దేశంలో రాయ్ టైఫూన్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి దాదాపు 75 మందికిపై ప్రజలు మృత్యువాతపడ్డారు. అలాగే, ఆ దేశంలోని అనేక ద్వీపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా అపారమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. 
 
బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధితులకు నీరు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. దక్షిణ, మధ్య ప్రాంతాలను తుఫాను ధ్వంసం చేయడంతో 3 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను, బీచ్ ఫ్రంట్ రిసార్ట్‌లను వదిలి పారిపోయారు. తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో కమ్యూనికేషన్లు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. ఇళ్ళపై పైకప్పులు కూలిపోయాయి.