శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (15:42 IST)

ఫిలిప్పీన్స్​లో కొత్త చట్టం.. లైంగిక సంబంధానికి వయస్సును పెంచారు..

ఫిలిప్పీన్స్​లో కొత్త చట్టం వివాదాస్పదం అయ్యింది. టీనేజీ కూడా రాని వారితో కూడా ఎక్కువ వయసులో ఉన్న వారు సెక్స్​ చేయడం ఫిలిప్పీన్స్​లో చట్టబద్ధంగా ఉంది. ఇరువురి అంగీకారం ఉంటే 12 సంవత్సరాల వయసు నుంచి లైంగిక సంబంధం పెట్టుకోవచ్చనేలా అనుమతులు ఉన్నాయి. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇంత తక్కువ వయసు నిబంధన లేదు.
 
ఫిలిప్పీన్స్​లో మతపరమైనమ్మకాలు ఎక్కవ. అది క్యాథలిక్ దేశం. అక్కడ విడాకులు తీసుకోవడం చట్ట విరుద్ధం (ఫిలిప్పినో ముస్లింలు మినహా). అయితే ఇందుకు విరుద్ధంగా.. తక్కువ వయసు అమ్మాయిలను పెళ్లి చేసుకునే కోరిక తీర్చుకోవాలన్న స్పానిష్ వలసవాదులు ప్రేరేపిస్తే తెచ్చిన చట్టంగా తక్కువ వయసు సెక్స్ నిబంధనపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. 
 
కాగా ఇంత తక్కువ వయసులో సెక్స్​లో పాల్గొనడాన్ని చట్టంబద్ధం చేయడం వల్ల ఎంతో మంది పిల్లలు వేధింపులకు గురవుతున్నారని బాలల హక్కుల ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మహిళల కంటే బాలికలపైనే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలపై వేధింపులు ఎక్కువవుతున్నాయనే ఫిర్యాదులు సైతం ఆన్​లైన్​లో పెరుగుతున్నాయని, లాక్​డౌన్ సమయంలో ఇది మరింత ఎక్కువైందని చెబుతున్నారు.
 
ఈ వయసు విషయంపై కొందరు పోరాడుతూనే ఉన్నారు. చిన్న వయసు వారితో సెక్స్​ను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తే రేప్ కేసులను త్వరగా విచారించవచ్చని అభిప్రాయపడుతున్నారు. అలాగే కోర్టు రూమ్​లో క్రాస్ ఎగ్జామినేషన్ నుంచి పిల్లలను కాపాడవచ్చని, ప్రస్తుతం దీనిద్వారా చాలా మంది ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదని సేచ్ ఫిలిప్పీన్స్​ చిల్డ్రన్ చారిటీ ప్రతినిధి అల్బెర్టో మయోట్ అన్నారు.
 
అయితే ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ఈ సమస్యలపై అక్కడి రాజకీయ నాయకులు ఈ విషయంపై దృష్టిసారించారు. సెక్స్​లో పాల్గొనే చట్టబద్ధ వయసును 12 నుంచి 16కు పెంచే బిల్​ను చట్టసభ ప్రతినిధులు ఆమోదించారు. 207 మంది దీనికి మద్దతుగా ఓటేయగా.. ముగ్గురు వ్యతిరేకించారు. 
 
సెనేట్​లోనూ ఈ బిల్లు రానుంది. ప్రెసిడెంట్ రోడ్రిగో దుటెర్టె సైతం ఈ బిల్లుకు ఆమెదం తెలుపడం కచ్చితం. చిన్నతనంలో తాను కూడా వేధింపులను ఎదుర్కొన్నానని రోడ్రిగో కూడా చెప్పారు. దీంతో త్వరలోనే ఈ దేశంలో సెక్స్​ చట్టబద్ధ వయసు 16 ఏళ్లకు పెరగనుంది.