వీడియో కాల్.. కెమెరా ఆన్‌లో వుండగానే.. సెక్రటరీతో రొమాన్స్.. దొరికిపోయాడు...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించడంతో లాక్ డౌన్‌ల కారణంగా ఇంటివద్దనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగా మీటింగ్‌లన్నీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. జూమ్, గూగుల్ ద్వారా మీటింగ్‌లు కండెక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో కాలింగ్‌లో కొంతమంది సొంత పనులు చేస్తూ దొరికిపోతున్నారు. తాజాగా ఫిలిప్పీన్స్‌కు చెందిన వీడియో కాల్ ఆన్ చేశామనే విషయాన్ని మరిచిపోయిన ఓ ప్రభుత్వ అధికారి అడ్డంగా దొరికిపోయాడు.
సెక్రటరీతో శృంగారం కానిచ్చాడు. పగలనే విషయాన్ని పక్కనబెట్టి.. వీడియో కాల్ ఆప్షన్ ఆన్‌లో వుందనే విషయాన్ని మరిచిపోయి పనికానిచ్చేశాడు. అంతా అయిపోయాక అలసిపోయి సేదతీరాడు. అయితే ఈ తంతు కంటే ముందే అతడు ఓ ప్రభుత్వ గ్రూప్ మీటింగ్ వీడియో కాల్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ఆ వీడియో కాల్ మొదలైన తరువాత సెక్రటరీ రావడంతో వీడియో కాల్ విషయం మరచిపోయాడు. కెమెరా ఆన్‌లో ఉందని, తన ప్రతాపమంతా లైవ్‌లో చూస్తున్నారని దొరికిపోయాడు.
ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఈ ఘటన ఫిలిప్పైన్స్‌లో చోటుచేసుకుంది. స్థానిక కావిటే ప్రావిన్స్‌లోని ఫాతిమా డాస్ విలేజ్ కౌన్సిల్ అధికారి కెప్టెన్ జీసస్ ఎస్టిల్ ఈ నిర్వాకం చేశాడు.