శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (12:25 IST)

టీచింగ్ వృత్తికాదు.. ఓ ఫ్యాషన్.. 91 యేళ్ల వయసులోనూ ఆన్‌లైన్ క్లాసులు

చాలా మందికి టీచింగ్ అంటే ఓ వృత్తి. ఉపాధి కోసం చేసే పనిగా భావిస్తారు. కానీ, ఆయన మాత్రం టీచింగ్‌ను ఓ వృత్తిలాకాకుండా ఓ ఫ్యాషన్‌గా భావించారు. అందుకే.. 91 యేళ్ల వయసులోనూ ఆన్‌లైన్ క్లాసులు బోధిస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా స్కూళ్లు మూత‌బ‌డ‌టంతో వ‌ర్చువ‌ల్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు. 
 
ఈ 91 యేళ్ళ ప్రొఫెసర్ సెయింట్ థామస్ విశ్వవిద్యాలయంలో 50 యేళ్లుగా ఇంగ్లీష్ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నారు. ఈ యవసులోనూ ఎంతో ఓపిగ్గా ఐర‌న్ దుస్తులు, షూస్ వేసుకొని ఒక బాస్‌లా వ‌ర్చువ‌ల్ బోధ‌న‌ను స్వీక‌రిస్తున్నారు. ఎన్నో ద‌శాబ్దాల నుంచి బోధిస్తున్న‌ప్ప‌టికీ వృత్తి మీద అభిరుచి ఉత్సాహం మాత్రం మొద‌టిసారిలా ఉంది. 
 
ఈయన క్లాసులు వినే పిల్ల‌లు ఎంత అదృష్ట‌వంతులో అంటూ ప్రొఫెస‌ర్ కూతురు జులియా ఫేస్‌బుక్‌లో ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌ను 62 వేల‌కు పైగానే లైక్ చేశారు. అంతేకాదు 23 వేల‌మంది షేర్ చేశారు. ఈయన వృత్తి, నిబద్ధత పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.