శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (12:49 IST)

కరోనా కణంపై పరిశోధనలు.. మాస్క్ ఒక్కటే సరైన ఆయుధం

కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కంటికి కనిపించని వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ మనిషిని ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. వైరస్ చుట్టూ ప్రోటీన్ పొర, దాని లోపల జన్యువులు ఉంటాయి. కరోనా కణంలోపల ఉండే జన్యువులపై పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు.
 
కరోనా వైరస్‌కు చెక్ పెట్టాలి అంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిపుణులు చెప్తున్నారు. మాస్క్‌తో మాత్రమే ప్రస్తుతానికి కరోనాను అడ్డుకోగలమని పరిశోధకులు చెప్తున్నారు. 
 
కరోనా సోకినా వారిలో శ్వాససంబంధమైన వ్యవస్థలోనే కరోనా వైరస్ అధికంగా ఉందని నార్త్ కరోలీనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మాస్క్ పెట్టుకుంటే బయట నుంచి వైరస్ ముక్కు నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించలేదని అంటున్నారు. ప్రస్తుతం మనిషి వద్ద ఉన్న ఆయుధం మాస్క్ ఒక్కటే అని చెప్తున్నారు