శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:34 IST)

తెలంగాణలో కరోనావైరస్ కేసులు సంఖ్య భారీగా తగ్గుదల, కారణం ఏంటి?

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ఉగ్ర పంజాను విసురుతున్నది. దీంతో రోజురోజుకు వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. దీనికితోడు తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు అంతకంతకూ పెగుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,417 కేసులు నమోదయ్యాయి.
 
గత కొన్ని రోజులుగా నమోదైన కేసులతో పోలిస్తే తాజా కేసుల సంఖ్య తగ్గాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే తీరు కొనసాగితే రాష్ట్రంలో కరోనా విస్తరణ తగ్గుముఖం పట్టినట్టుగా భావించవచ్చు. మరోవైపు తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,513కి చేరింది.
 
ఇదే సమయంలో మరణాల సంఖ్య 974కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 13 మంది కరోనాతో చనిపోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు 264 జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి జిల్లా 133, కరీంనగర్ జిల్లా 108గా ఉన్నాయి. కాగా తాము తీసుకుంటున్న పగడ్బంది చర్యలు ఒకవైపు, ప్రజల్లో పెరిగిన అవగాహన ఇంకోవైపు వెరసి కరోనా కేసులు తగ్గాయని తెలంగాణ ప్రభుత్వం చెపుతున్నది.