మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 16 సెప్టెంబరు 2020 (17:00 IST)

వ్యాపార సంస్థలు జిఎస్టీని సరిగ్గా అమలు పరిచేందుకు అవలారా ఇ-ఇన్‌వాయిసింగ్ సొల్యూషన్

అవలారా, ఇంక్ అన్ని సైజులలోని వ్యాపార సంస్థలకు, క్లౌడ్-ఆధారిత ట్యాక్స్ కంప్లియన్స్ ఆటోమేషన్ అందించడం ద్వారా ఇ-ఇన్‌వాయిసింగ్ అవసరాలను నిర్వహించేందుకు మరియు ఈ రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను సరిగ్గా అమలు చేసేందుకు సహాయపడేలా ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ అందించే ఒక ప్రముఖ సంస్థ అవలారా ఇండియా జిఎస్‌టి ఇ-ఇన్‌వాయిసింగ్,  లభ్యతను ఈరోజు ప్రకటించింది.
 
అవలారా యొక్క సాంకేతిక సొల్యూషన్స్ పై నిర్మించబడిన ఈ కొత్త ఆఫరింగ్, భారతదేశంలోని వ్యాపార సంస్థలు తమ వస్తు మరియు సేవా పన్ను (జిఎస్‌టి)ని సరిగ్గా అమలు పరచేందుకు, జిఎస్‌టి రిటర్నులు  మరియు ఇ-వేబిల్లులను వాలిడేట్, భద్రపరచడం మరియు ఇన్‍వాయిస్లను నిర్వహించే కొత్త అనుభవాన్ని అందిస్తోంది.
 
భారతదేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఇ-ఇన్‌వాయిసింగ్ అనేది, వ్యాపారాలపై అదనపు భారాన్ని మోపుతోంది. అక్టోబర్ 1, 2020 నుండి అమల్లోకి వచ్చే కొత్త ఇ-ఇన్‌వాయిసింగ్ విధానం, వ్యాపార సంస్థలు చట్టపరమైన ఈ సంస్కరణలను అమలుపరచేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టవలసినందున ఇది ఆ వ్యాపార సంస్థలపై కంప్లియన్స్ మరియు సాంకేతిక భారాన్ని పెంచుతున్నాయి.
 
కేంద్ర పరోక్ష పన్ను మరియు కస్టమ్స్ నియమాల ప్రకారం, భారతదేశంలో రూ. 500 కోట్ల కంటే ఎక్కువ(సుమారు యుఎస్ 68 మిలియన్ డాలర్లు) వార్షిక టర్నోవర్ కలిగివున్న వ్యాపార సంస్థలు,  వారి ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఇఆర్‌పి) లేదా ఇతర అక్కౌంటింగ్ పద్ధతుల నుండి ట్యాక్స్ ఇన్‌వాయిస్‌లు లేదా డెబిట్-క్రెడిట్ నోట్స్ తీసుకోవలసి ఉంటుంది మరియు తమ బిజినెస్-టు- బిజినెస్ (బి2బి) లావాదేవీలను, అక్టోబర్ 1, 2020 నుండి మొదలయ్యే ఇన్‌వాయిస్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్‌తో నమోదు చేసుకోవలసి ఉంటుంది. 
 
రిజిస్ట్రేషన్ పోర్టల్, ఇన్‌వాయిస్‌ యొక్క ప్రామాణికతను మరియు భిన్నత్వాన్ని తనిఖీ చేసిన తరువాత, జిఎస్‌టి నెట్‌వర్క్ (జిఎస్‌టిఎన్‌) ఒక ఇన్‌వాయిస్‌ రిఫరెన్స్ నెంబర్ (ఐఆర్ఎన్) మరియు ఒక క్విక్ రెస్పాన్స్ కోడ్ (క్యుఆర్) తో డిజిటల్‌గా సంతకం చేయబడిన ఒక ఇ-ఇన్‌వాయిస్‌ను జనరేట్ చేస్తుంది. ఆ తరువాత, ఈ ఇన్‌వాయిస్‌లు ఆయా వ్యాపార సంస్థలకు రికార్డులు సరిగా ఉంచుకొనేందుకు మరియు వారి వ్యాపార భాగస్వాములతో పంచుకోవడానికి ఉపయోగించుకోవడానికి జారీ చేయబడతాయి.
 
ఈ కొత్త ఇ-ఇన్‌వాయిసింగ్ అవసరాలు అంటే, వ్యాపార సంస్థలు తమ జిఎస్‌టి రిపోర్టింగ్ అవసరాలను ప్రభావవంతంగా మేనేజ్ చేసుకొనేందుకు ఇఆర్‌పి మరియు అక్కౌంటింగ్ విధానాన్ని నవీకరణ చేసుకోవాలి. భారతదేశంలో వ్యాపారం నిర్వహించే ప్రపంచవ్యాప్త సంస్థలు, ఖచ్చితమైన ఐఆర్‌ఎన్‌ల మరియు క్యుఆర్ కోడ్‌లతో ఇ- ఇన్‌వాయిస్‌లను నిరంతరం జనరేట్ చేయడానికి, అవసరాలకు కట్టుబడి ఉండేందుకు ఇ-ఇన్‌వాయిసింగ్ అవసరమవుతుంది. మానవసహాయంతో ఇ- ఇన్‌వాయిస్‌లను వాస్తవసమయంలో జనరేట్ చేసి, ఎంతో జిఎస్‌టి ప్రమాణాలను కలిగివుండటం భారంగా అవుతోంది.
 
అవలారా ఇండియా జిఎస్‌టి ఇ- ఇన్‌వాయిసింగ్జి ఎస్‌టి ఇ-ఇన్‌వాయిసింగ్, వాస్తవ సమయంలో వ్యాపార సంస్థలు తమ లావాదేవీలకు భారీస్థాయిలో, బ్యాచ్‌లలో జిఎస్‌టి రిటర్నులను మరియు ఇ-వేబిల్లులను ఏవిధమైన ఇబ్బంది లేకుండా ఆటోమేటింగ్ చేయడంద్వారా జనరేట్ చేసుకొనే వీలు కల్పిస్తుంది. ఇది చేయడానికి వ్యాపార సంస్థలు చేయవలసింది ఇదే.
 
* స్కేలుపై ఇ-ఇన్‌వాయిసింగ్‌ను. సులభతరం చేసుకోండి జిఎస్‌టిఎన్‌లు మఎఇయు కస్టమైజ్ చేయబడిన ఇన్‌వాయిస్‌ ప్రింటింగ్‌తో మిలియన్లకొద్దీ ఇన్‌వాయిస్‌లను జనరేట్ చేయడంద్వారా మానవశ్రమతో కూడుకొన్న కంప్లియన్స్ విధానానికి స్వస్తి పలకండి.
 
* ప్రస్తుతమున్న సాఫ్ట్‌వేర్ సమూహంతో నిరంతరం కొనసాగే సమీకృత ప్రక్రియ అందించండి. కావలసిన విధంగా ఉండె ఎపిఐ ఇంటిగ్రేషన్లు లేదా ఫైల్ అప్‌లోడ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఇఆర్‌పి) మరియు ఇతర అక్కౌంటిగ్ విధానాలకు ప్రస్తుతమున్న పనివిధానాలలో ఉండే అంతరాయాలను తగ్గించుకోండి