శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:12 IST)

రెడ్ మీ నుంచి కొత్త ఫోన్... సెప్టెంబర్ 18 నుంచి ఫ్లిఫ్ కార్ట్, ఎంఐ షోరూంలలో..

Redmi 9
రెడ్ మీ నుంచి కొత్త ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. రెడ్‌మీ 9 సిరీస్‌లో భాగంగా 9ఐ పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో 9, 9ఏ, 9 ప్రైమ్‌ మోడల్స్‌ సందడి చేస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌ ఫోన్‌ మార్కెట్‌ లక్ష్యంగా రెడ్‌మీ 9ఐను తీసుకొచ్చారు. 
 
బడ్జెట్‌ ధర, పెద్ద బ్యాటరీ, నాచ్‌డ్‌ డిస్‌ప్లే, సింగిల్ కెమెరా వంటివి ఈ ఫోన్‌ ప్రత్యేకతలు. సెప్టెంబరు 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌, ఎంఐ హోం స్టోర్లలో ఫోన్ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. మిడ్‌నైట్‌ బ్లాక్‌, సీ బ్లూ, నేచర్‌ గ్రీన్‌ రంగుల్లో 9ఐ లభిస్తుంది.
 
ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో లభించనుంది. 4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ధర రూ. 8,299గాను, 4జీబీ ర్యామ్‌/128జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్ ధర రూ.9,299గా కంపెనీ నిర్ణయించింది. 
 
ఫీచర్లు...
రెడ్‌మీ 9ఐ ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత ఎంఐయుఐ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది.
6.53 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. 
ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ25 ప్రాసెసర్‌
రెండు కెమెరాలు, 
వెనక వైపు 13 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, 
5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,
10 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ 
ముందు భాగంలో సెల్ఫీల కోసం 5ఎంపీ ఏఐ కెమెరాలను ఈ ఫోన్ కలిగివుంటుంది.