సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:24 IST)

రైతుల్లా నటిస్తున్నారు.. వాళ్లే టార్గెట్.. పాక్ సరిహద్దుల్లో "ఆపరేషన్ అర్జున్"

పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు బీఎస్ఎఫ్ సరికొత్త ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి కోడ్ నేమ్ ఆపరేషన్ అర్జున్. భారత జవాన్లను హతమార్చేందుకు స్నిప్పర్లను వాడుతూ, సరిహద్దుల్లోని గ్రామాలపై కాల్పులతో విరుచుక

పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు బీఎస్ఎఫ్ సరికొత్త ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి కోడ్ నేమ్ ఆపరేషన్ అర్జున్. భారత జవాన్లను హతమార్చేందుకు స్నిప్పర్లను వాడుతూ, సరిహద్దుల్లోని గ్రామాలపై కాల్పులతో విరుచుకుపడుతూ, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న పాక్ వైఖరికి చెక్ పెట్టే దిశగా ఆపరేషన్ అర్జున్ అనే పేరిట కొత్త ఆపరేషన్‌ను చేపట్టనుంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా సరిహద్దులకు దగ్గరగా పాకిస్థాన్ వైపు నివాసాలు ఏర్పరచుకున్న రిటైర్డ్ సైనికులు, ఐఎస్ఐ, పాక్ రేంజర్ల నివాసాలు, వారి భూములను టార్గెట్ చేయనుంది. 
 
గతంలో సరిహద్దుల్లో ఏళ్ల తరబడి విధులు నిర్వహించి, ఆపై పదవీ విరమణ చేసిన సైనికులకు అక్కడికి దగ్గర్లోనే భూములు, ఇళ్లు ఇస్తున్న పాక్ ప్రభుత్వం వారి సేవలను మరో రకంగా వినియోగించుకుంటోంది. వారిచ్చే సమాచారంతోనే యువ టెర్రరిస్టులు సులభంగా భారత్‌లోకి చొచ్చుకు వస్తున్న  పరిస్థితి నెలకొందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
పొలాల్లో పని చేస్తున్న రైతుల్లా నటిస్తూ, భారత్ వైపు జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించే వీరు, ఆ సమాచారాన్ని సైనికాధికారులతో పంచుకుంటున్నారు. వీరిని నిలువరించేందుకు భారత ప్రభుత్వం అర్జున అస్త్రాన్ని బయటికి తీసింది. 
 
ఇందులో భాగంగా సరిహద్దుల్లో నివాసాలు ఏర్పరుచుకుంటున్న వారు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాల్లోని రిటైర్డ్ ఆఫీసర్ల నివాసాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ను వెనక్కి తీసుకోవాలంటే.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ విరమించుకోవాలని భారత్ డిమాండ్ చేస్తోంది.