1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (14:39 IST)

బురుండీ దేశాధ్యక్షుడు కురుంజిజా మృతి.. కరోనా కారణమా?

Burundi president
ఆఫ్రికాఖండ దేశమైన బురుండీ దేశాధ్యక్షుడు ఎన్ కురుంజిజా ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవలే అనారోగ్యం బారిన పడి కోలుకున్నప్పటికీ.. చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆకస్మిక గుండెపోటుతోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ప్రభుత్వం చెబుతున్నా కరోనాతోనే చనిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన భార్యకు కూడా కరోనా సోకడం ఈ అనుమానాలకు బలమిస్తోంది.
 
55 ఏళ్ల కురుంజిజా శనివారం ఆస్పత్రిలో చేరి, సోమవారానికల్లా కోలుకున్నాడు. మంగళవారం అనూహ్యంగా గుండెపోటు వచ్చిందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా బతికించలేకపోయామని వైద్యులు చెప్తున్నారు. కురుంజిజా భార్య డెనిస్‌కు ప్రస్తుతం కెన్యాలోని అగాఖాన్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. బురుండీలో ఇప్పటివరకు 83 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మాత్రమే మరణించారు.