Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. మకీ బి తొలి మరణం నమోదు

Written By ఠాగూర్
Updated: సోమవారం, 19 జులై 2021 (08:11 IST)
చైనా దేశంలో ప్రాణాంతక వైరస్‌లకు పుట్టుకకు కేంద్రంగా మారినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలోని వుహాన్ పరిశోధనా ల్యాబ్ నుంచి కరోనా వైరస్ పుట్టినట్టు ప్రపంచ దేశాలు కోడై కూస్తున్నాయి. తాజాగా మరోవైరస్ చైనా నుంచి పుట్టినట్టుగా భావిస్తున్నారు. ఈ వైరస్ పేరు మంకీ బి. 
 
కోతుల నుంచి మనుషులకు సంక్రమించే ‘మంకీ బి’ వైరస్‌తో ఓ వ్యక్తి మరణించినట్టు చైనా తాజాగా వెల్లడించింది. ఇదే తొలి కేసు, తొలి మరణమని పేర్కొంది. అయితే, అతడితో సన్నిహితంగా ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు లేవని స్థానిక మీడియా తెలిపింది.
 
జంతువులపై పరిశోధనలు చేస్తున్న బీజింగ్‌కు చెందిన ఓ పశువైద్యుడు (57) మార్చిలో రెండు చనిపోయిన కోతుల శరీరాలను ముక్కలుగా చేసి పరీక్షించాడు. అనంతరం అతడు వాంతులు, వికారం వంటి లక్షణాలతో బాధపడ్డాడు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మే 27న సదరు వైద్యుడు మరణించినట్టు అధికారులు తెలిపారు.
 
వైద్యుడి నమూనాలు పరిశీలించగా ‘మంకీ బి’ వైరస్ కారణంగా అతడు మరణించినట్టు నిర్ధారణ అయింది. చైనాలో ఇంతకుముందు ఇలాంటి వైరస్ ఎవరిలోనూ బయటపడలేదని, ఇదే తొలి కేసు, తొలి మరణమని చైనాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. 
 
ఈ వైరస్‌ను తొలిసారి 1932లో మకాక్స్ అనే కోతి జాతిలో గుర్తించారు. కోతుల నుంచి నేరుగా మనుషులకు సంక్రమించే ఈ వైరస్ చాలా ప్రమాదకరమని, ఇది సోకితే మరణాల రేటు 80 శాతం వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్‌ను మంకీ ‘బీవీ’గా పిలుస్తారు.

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments