శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (18:36 IST)

అరుణాచల్‌లో చైనా గ్రామం: మెగా విలేజ్ భారత్‌లో లేదు

భారత సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాల అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కాశ్మీర్‌పై పెత్తనం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంటే... అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రమే తమదని చైనా దేశం వాదిస్తోంది. ఇప్పటికే లఢక్ ప్రాంతంలో ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో కూడా సేమ్ సీన్. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా విలేజ్ నిర్మించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. 
 
అమెరికా రక్షణ శాఖ కేంద్ర కార్యాలయం పెంటగాన్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో భారత సరిహద్దుల్లో చైనా ఓ భారీ గ్రామాన్ని నిర్మించినట్లు వెల్లడించింది. ఇదే ఇప్పుడు అంతర్జాతీయంగా ఓ పెద్ద దుమారం రేపుతోంది. అసలు చైనా అంత పెద్ద గ్రామాన్నే నిర్మిస్తుంటే... భారత సర్కార్ ఏం చేస్తుందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
 
దీనిపై భారత రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. పెంటగాన్ చూపించిన మెగా విలేజ్ భారత్‌లో లేదని తేల్చి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఆ గ్రామానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అది భారత వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న వివాదాస్పద ప్రాంతంలో ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. ఈ గ్రామం ఇప్పట్లో నిర్మించింది కాదని కూడా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.