బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (10:32 IST)

ఉక్రెయిన్‌పై దండయాత్ర.. రష్యాలో 170 శాతం పెరిగిన కండోమ్ అమ్మకాలు

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా దేశంలో కండోమ్ అమ్మకాలు ఏకంగా 170 శాతం మేరకు పెరిగిపోయాయి. అయితే, రష్యా ప్రజలు అధికంగా కండోమ్‌లు కొనుగోలు చేయడానికి కారణం లేకపోలేదు. 
 
ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధాన్ని ప్రపంచం దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. రష్యాపై పశ్చిమ దేశాలు అనేక రకాలైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో కండోమ్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయనే భయం రష్యన్‌లలో నెలకొంది. ఈ కారణఁగానే కండోమ్‌ల విక్రయాలు ఆ దేశంలో ఒక్కసారిగా పెరిగిపోయింది., 
 
మరోవైపు, పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా కరెన్సీ విలువ నానాటికీ తగ్గిపోతుంది. డాలర్, యూరోలతో పోల్చుకుంటే ఇది గణనీయంగా తగ్గిపోతుంది. ఈ కారణంగా కండోమ్‌ల ధరలు కూడా పెరుగుతున్నాయి. 
 
ప్రస్తుత మార్కెట్‌లో ప్రజలు కండోమ్‌లను భవిష్యత్ అవసరాల కోసమే కొనుగోలు చేస్తున్నారని, రానున్న కాలంలో కండోమ్‌ల ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని భావించి విపరీతంగా కొనుగోలు చేస్తున్నవారు. దీంతో వీటి విక్రయాలు గత నెల రోజుల కాలంలో ఏకంగా 170 శాతం మేరకు పెరిగిపోయాయి.