సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 మార్చి 2022 (07:22 IST)

నేడు తెరైపైకి రాధేశ్యామ్ : టిక్కెట్ ధరల పెంపునకు సమ్మతం

ప్రభాస్ - పూజా హెగ్డే నటించిన ప్రేమకావ్యం "రాధేశ్యామ్". రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కింది. అయితే, ఈ చిత్రం ఐదో ఆటను వేసుకునేందుకు, టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
 
ఇపుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. సినిమా బడ్జెట్ రూ.170 కోట్లు దాటినందున ప్రీమియం టిక్కెట్ ధరపై రూ.25 పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయం చివరి నిమిషంలో వెల్లడించింది. ప్రీమియం టిక్కెట్ ధరను రూ.25 మేర పెంచుకునే అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, "రాధేశ్యామ్" నిర్మాణానికి రూ.170 కోట్లు దాటిపోయిందని, అందువల్ల టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వానికి చిత్రం బృందం విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిశీలించిన ఏపీ సర్కారు సానుకూలంగా స్పందించింది. కాగా, హీరో, దర్శకుల రెమ్యునరేషన్ కాకుండా చిత్ర బడ్జట్ రూ.100 కోట్లు దాటితే టిక్కెట్ల ధరల పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే.