శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (15:55 IST)

పంచతంత్రం : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లేటెస్ట్ ట్రెండ్స్

దేశంలో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అయితే, ఇప్పటివరకు వెల్లడైన ట్రెండ్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీ ఐదు రాష్ట్రాల్లోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా ఫలితాలు ఉన్నాయి. వాటి వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 403 సీట్లు ఉండగా బీజేపీ 265 చోట్ల ఆధిక్యం లేదా గెలుపు బాటలో ఉంది. సమాజ్‌వాదీ పార్టీ 133 స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ 2, బీఎస్పీ 1, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 
 
పంజాబ్ రాష్ట్రంలో 117 సీట్లు ఉండగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 19, శిరోమణి అకాలీదళ్ 4, బీజేపీ 2, ఇతరులు ఒక చోట ఆధిక్యంలో ఉన్నారు. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం 70 సీట్లు ఉండగా, బీజేపీ 48, కాంగ్రెస్ 18, బీఎస్పీ, ఇతరులు రెండేచి చోట్ల గెలుపొందారు. 
 
గోవాలో మొత్తం 40 సీట్లు ఉండగా బీజేపీ 19, కాంగ్రెస్ 12, టీఎంసీ 3, ఆప్ 3, ఇతరులు మూడుచోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
మణిపూర్‌ అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా బీజేపీ 30, కాంగ్రెస్ 8, ఎన్.పి.పి 9, జేడీయు 4, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.