బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మే 2020 (17:41 IST)

కోవిడ్ రోగులపై పరిశోధన.. వీర్యంలోనూ తిష్టవేస్తున్న కరోనా వైరస్

కరోనా వైరస్ పురుషుల వీర్యంలో దాగివుంటుందని చైనా పరిశోధనలో తేలింది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న మూడేళ్ల వరకు కూడా ఆయా భాగాల్లో వైరస్ జీవించి ఉండే అవకాశం ఉందన్నారు. లైంగిక చర్య ద్వారా వైరస్ అక్కడి నుంచి భాగస్వామికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ వైరస్ పురుషుల వీర్యంలోనూ తిష్ట వేస్తున్నట్టు చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
 
చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లోని షాంఘ్‌క్యూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది కరోనా రోగుల వీర్యాన్ని పరీక్షించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు.

కేంద్ర నాడీవ్యవస్థలోని ఇమ్యునోప్రివిలైజ్డ్ సైట్స్‌గా చెప్పబడే వృషణాలు, కళ్లు, పిండం భాగాల్లోకి చేరిన వైరస్ శరీర రక్షణ వ్యవస్థ దాడి నుంచి తట్టుకుని జీవించగలదని పేర్కొన్నారు. అందుకే లైంగికంగా కలవడం కరోనా రోగులు దూరంగా వుండాలని.. కండోమ్ వాడకం ఈ రోగులకు నివారణ మార్గంగా పరిగణించవచ్చునని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.
 
పురుష పునరుత్పత్తి వ్యవస్థలో వైరస్ ప్రతిబింబించలేక పోయినప్పటికీ, ఇది కొనసాగవచ్చు, బహుశా వృషణాల రోగనిరోధక శక్తి వల్ల కావచ్చునని శాస్త్రవేత్తల బృందం తెలిపింది.