సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (15:19 IST)

కరోనా వైరస్ మహమ్మారి.. 1,113కి చేరిన మృతుల సంఖ్య.. ఒక్కరోజే?

కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను మింగేస్తోంది. వైద్యపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల ఇప్పటికే 1,113 మందికి ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది. చైనాలో శుక్రవారం ఒక్కరోజే కరోనా వైరస్ కారణంగా 143 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా మరో 2 వేల 641 మంది ఈ వైరస్ బారినపడ్డారు. డ్రాగన్ కంట్రీలో మొత్తం 66వేల 492మంది కరోనా బాధితులుండగా.. వారిలో 11వేల 82మంది పరిస్థితి విషమంగా ఉంది. 
 
కరోనా వైరస్ కారణంగా చైనాలోని అనేక పట్టణాలు, నగరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోజువారీ అవసరాలకు కూడా ప్రజలు రోడ్లమీదికి రావడానికి వణికిపోతున్నారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది.
 
మరోవైపు కరోనా వైరస్‌ అనుమానంతో జపాన్‌ తీరంలో నిలిపేసిన డైమండ్‌ ప్రిన్సెస్‌ ఓడలోని 3వేల711 మందిలో 218 కేసులను పాజిటివ్‌గా గుర్తించగా... వారిలో ముగ్గురు భారతీయులుండటం ఆందోళన రేపుతోంది. ఈ ఓడలోని 138 భారతీయుల్లో 132 మంది సిబ్బంది కాగా, ఆరుగురు ప్రయాణికులున్నారు. దీంతోపాటు ఓడలోని ప్రయాణికుల్లో... కరోనా సోకినట్లు నిర్ధారించిన 11 మంది వృద్ధులను జపాన్‌ అధికారులు బయటకు పంపించారు.