శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (18:07 IST)

కోల్‌కతాలో మరో కరోనా కేసు... వైరస్ వ్యాపించే దేశాల్లో భారత్ ఉందా?

భారత్‌లో మరో కరోనా వైరస్ కేసు వెలుగుచూసింది. కోల్‌కతాలో తాజాగా మరో కేసు బయటపడింది. దీంతో కోల్‌కతాలో మొత్తం కేసుల సంఖ్య మూడుకు చేరింది. నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మరో వ్యక్తికి నావల్ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ చేశారు. ఈ మేరకు విమానాశ్రయా అధికారులు ఒక ప్రకటన చేస్తూ.. బ్యాంకాక్ నుంచి కోల్‌కతా చేరుకున్న ప్రయాణికుడికి పరీక్షలు చేయగా కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు.
 
ఈ కేసుతో కలుపుకుంటే కోల్‌కతాలో మొత్తం మూడు కేసులు నమోదైనట్టే. ఈ వారంలో హిమాద్రి బార్మాన్, నాగేంద్ర సింగ్ అనే ఇద్దరు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలారని చెప్పారు. పాజిటివ్‌గా తేలిన వారిని బలియాఘటా ఐడి అస్పత్రికి పంపినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావంతో చైనాకు సర్వీసులు నడుపుతున్న పలు విమానాయన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి.
 
మరోవైపు, వైరస్ వ్యాపించే అవకాశమున్న మొదటి పది దేశాల్లో వరుసగా థాయ్‌లాండ్, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, తైవాన్, అమెరికా, వియత్నాం, మలేషియా, సింగూపూర్, కంబోడియాలున్నాయి. థాయ్‌లాండ్‌కు వైరస్ సోకే అవకాశాలు 2.1 శాతం ఉండగా, భారత్‌కు ఇది 0.2 శాతం ఉందని నివేదిక వెల్లడించింది.