చైనాలో కరోనా మృత్యుకేళి... ఒకే రోజు 240 మంది మృతి

coronavirus
ఠాగూర్| Last Updated: గురువారం, 13 ఫిబ్రవరి 2020 (09:02 IST)
చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగిస్తోంది. ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా, ఒకే రోజు 240 మంది చనిపోయారు. ఈ మృత్యుకేళి హుబేయ్ ప్రావిన్స్‌లో సంభవించింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌ర్వాత ఇంత ఎక్కువ స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి.

అలాగే, ఒక్క బుధవారమే దేశ వ్యాప్తంగా కొత్తగా 15 వేల కేసులు నమోదయ్యాయి. హుబేయ్ కేంద్రంగా విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్‌కు.. తాజాగా కోవిద్‌-19 అని పేరు పెట్టింది. దేశ‌వ్యాప్తంగా సుమారు 60 వేల కోవిద్‌-19 కేసులు న‌మోదు అయిన‌ట్లు వెల్లడించింది. మరోవైపు, క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగా 1310కి చేరుకున్న‌ది.

అయితే, హుబేయ్‌లో ఒక్క రోజు 242 మ‌ర‌ణించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. దాంట్లో 135 కేసుల‌ను క్లినిక‌ల్‌గా గుర్తించారు. మిగితా 107 మందికి కూడా కొత్త వైర‌స్ సోకిన‌ట్లు అనుమానిస్తున్నారు. కేవ‌లం హుబేయ్ ప్రావిన్సులోనే 48 వేల ఇన్‌ఫెక్ష‌న్ కేసుల‌ను డాక్ట‌ర్లు గుర్తించారు.దీనిపై మరింత చదవండి :