Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌పై మీ జోక్యం వద్దు.. అమెరికాకు తేల్చిచెప్పిన భారత్

Written By ఎం
Updated: శనివారం, 3 ఆగస్టు 2019 (07:57 IST)
సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరుగుతోంది. గురువారం మొదలైన ఈ సదస్సు.. శుక్రవారం రెండోరోజు కొనసాగింది. సదస్సుకు హాజరైన ఆసియాన్ దేశాల విదేశాంగ మంత్రులు తమ దేశాల మధ్య సంఘీభావానికి సూచికగా చేయిచేయి కలిపి ఫొటోలకు పోజులిచ్చారు.
 
 భారత విదేశాంగ మంత్రి జయశంకర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమావేశం అయ్యారు. కశ్మీర్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. కశ్మీర్ సమస్యను భారత్ – పాకిస్థాన్ రెండు దేశాలు కలిసి చర్చించుకుని పరిష్కరించుకుంటాయని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ.. మరే దేశం జోక్యం కానీ అవసరం లేదని జయశంకర్ మైకేల్ పాంపియోకు క్లియర్ గా చెప్పారు.
 
 పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ .. అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్ తన కామెంట్స్ తో సంచలనం రేపారు. కశ్మీర్ విషయంలో మీడియేషన్ చేయాలని భారత ప్రధాని, పాక్ ప్రధాని తనను అడిగారని ట్రంప్ చెప్పడంపై పెద్ద దుమారం రేగింది. ట్రంప్ మాట్లాడిన తర్వాత.. భారత్, పాక్ దేశాలు మొట్టమొదటగా చర్చించుకున్నది బ్యాంకాక్ లోని ఆసియాన్ సదస్సులోనే. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లోనే… కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ తోనే తేల్చుకుంటామని.. అమెరికాకు తేల్చిచెప్పింది ఇండియా.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments