ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (19:08 IST)

కరోనా టీకా వేయించుకుంటే 25 శాతం డిస్కౌంట్?!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాల వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్న ప్రచారం వల్ల చాలా మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో అనేక దేశాలు ఏం చేయాలో తలలు పట్టుకుంటున్నాయి. 
 
ఈ క్రమంలో యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 27 లక్షల మందికి వ్యాక్సిన్ వేసింది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగేందుకు యూఏఈలోని ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నాయి. తాజాగా దుబాయిలోని బాబ్ అల్ షామ్స్ అనే రిసార్ట్ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. 
 
వ్యాక్సిన్ వేయించుకున్న కస్టమర్లకు తమ హోటల్‌లోని అన్ని బుకింగ్స్‌పై 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు ఉండనున్నట్టు ప్రకటించింది. దుబాయి హెల్త్ అథారిటీ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తోందని, వారికి సహాయంగా తాము ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్టు హోటల్ యాజమాన్యం తెలిపింది.