శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (10:05 IST)

దీపావళి బొనంజా.. భారీగా తగ్గిన విమాన చార్జీలు...

కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రజా రవాణాపై ఆంక్షలు ఉన్నాయి. ముఖ్యంగా కోట్లాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చే రైళ్ళ రాకపోకలపై దేశ వ్యాప్తంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా విమాన ఛార్జీలను భారీగా తగ్గించింది. 
 
కరోనా కారణంగా ప్రజా రవాణాను ఆశ్రయించే వారి సంఖ్య తగ్గిపోగా, విమానాలు ఎక్కేవారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. అయితే, ఈ పండగ సీజన్‌ను ఉపయోగించుకుని, తిరిగి ప్రయాణికుల సంఖ్యను పెంచాలని భావిస్తున్న కేంద్రం, గత సంవత్సరంతో పోలిస్తే 30 నుంచి 40 శాతం మేరకు చార్జీలను తగ్గించింది.
 
తగ్గిన చార్జీల ప్రకారం, చెన్నై నుంచి బెంగళూరుకు రూ.1,700తోనే ప్రయాణించవచ్చు. ఇక హైదరాబాద్‌కు రూ.2,400 నుంచి రూ.2,800 వరకూ, ఢిల్లీకి రూ.4 వేల వరకూ చార్జీలను నిర్ణయించారు. ప్రస్తుతం అంతర్రాష్ట్రాల మధ్య మాత్రమే విమాన సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. 
 
అంతర్జాతీయ విమానాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక హైదరాబాద్ నుంచి ప్రయాణాలకు కేంద్రం నిర్ణయించిన చార్జీలతో పాటు ఎయిర్ పోర్ట్ యూజర్ డెవలప్‌మెంట్ చార్జీలు అదనంగా చెల్లించాల్సి వుంటుంది.