1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 మే 2025 (17:42 IST)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

Recep Tayyip Erdoğan
కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశ జోక్యం తప్పనిసరని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిస్ ఎర్డోగాన్ అన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌తో సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ, కాశ్మీర్ సమస్య పరిష్కారంలో సహాయం చేయడానికి, అందుకు మార్గాలను అన్వేషించడానికి ట్కీ సిద్ధంగా ఉందన్నారు. కాశ్మీర్ అంశంలో మూడో దేశం జోక్యం ఉండాలన్నారు. 
 
అయితే, కాశ్మీర్ పూర్తిగా తమ అంతర్గత విషయమని, ఇందులో మూడో దేశ జోక్యం అవసరం లేదని భారత్ పదేపదే పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ భారత్ వ్యతిరేక దేశాధినేతలు మాత్రం ఈ తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఎర్డోగాన్ ఇదే విధంగా కామెంట్స్ చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. 
 
పాకిస్థాన్ ప్రధాని షహ్‌‍బాజ్‌ షరీఫ్‌తో కాశ్మీర్ అంశంపై సమగ్రంగా చర్చించాం. సహాయం చేయడానికి మార్గాలను అన్వేషిస్తున్నాం. సమస్యలపై సమతుల్య విధానం ఇరు పక్షాలను పరిష్కరించడానికి దగ్గర చేస్తుంది. ఉద్రిక్తతలు మళ్లీ పెరగడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాలు చర్చలు ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.