గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (17:50 IST)

స్నాప్ చాట్ ద్వారా విద్యార్థికి నగ్న చిత్రాలను పంపిన టీచర్ అండ్ మిస్ కెంటకీ

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్.. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చింది. తన నగ్న చిత్రాలను 15 ఏళ్ల బాలుడికి పంపింది. ఈ ఘటన అమెరికాలోని కెంటకీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామ్సీ బియర్స్ (28) అనే యువతి 2014లో కెంటకీ రాష్ట్రంలో జరిగిన అందాల పోటీల్లో మిస్ కెంటకీ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆమె ప్రస్తుతం వర్జీనియాలోని ఆండ్రూ జాక్సన్ మిడిల్ స్కూల్‌లో పార్ట్ టైమ్ టీచర్‌గా పనిచేస్తోంది. 
 
అయితే అదే స్కూలులో చదువుతున్న ఓ 15 ఏళ్ల విద్యార్థికి స్నాప్ చాట్ ద్వారా బియర్స్ తన నగ్నచిత్రాలను పంపింది. అయితే ఈ ఫోటోలను బాలుడి తల్లిదండ్రులు పరిశీలించడంతో అసలు బాగోతం బయటపడింది. ఫలితంగా చిన్నారులకు అశ్లీల సమాచారం పంపినట్లు అభియోగాలు నమోదుచేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. స్కూల్ యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.