శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (09:06 IST)

హోంవర్క్ చేయలేదనీ మోకాళ్లు వాచిపోయేలా కొట్టిన టీచర్

హోంవర్క్ చేయలేదన్న కారణంగా నాలుగో తరగతి చదివే విద్యార్థిని మోకాళ్లు వాచిపోయేలా కొట్టారు. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని పఖాంజూర్‌లో గల ఒక ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థి నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి హోం చేయలేదని మోకాళ్ళపై తీవ్రంగా కొట్టారు. 
 
ఇంటికి వచ్చిన బిడ్డ మోకాళ్ళను చూసిన తల్లిదండ్రులు ఆగ్రహంతో స్కూలుకు చేరుకుని సంపంధిత టీచర్‌ను నిలదీశారు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని, ప్రిన్సిపాల్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని డీఈవో నియమించారు. అలాగే, శిశుసంక్షేమ అధికారులు కూడా విచారణ చేపట్టారు.