శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (14:34 IST)

విద్యార్థిని బెత్తంతో దంచిపారేసిన టీచర్.. డబ్బులిచ్చి చదువు చెప్పమంటే..?

గంటలకు జీతం మాట్లాడుకున్నాడు. విద్యార్థిని అదుపులో పెట్టమని.. బాగా చదివించమని.. తల్లిదండ్రులు చెప్పారు. కానీ ఆ టీచర్ మాత్రం బెత్తం చేతిలో దొరికింది కదాని దంచిపారేశాడు. దీన్ని సీసీటీవీ ఫుటేజ్‌లో చూసిన తండ్రి హడలిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, లక్నోకు చెందిన అమిత్.. వ్యాపారం చేసుకుంటున్నాడు. 
 
తన కుమారుడిని పెద్ద స్కూల్‌లో చేర్చాడు. అంతేగాకుండా అమిత్ కుమారుడు బాగా చదవాలని.. ఇంటికే ఓ టీచర్ వచ్చి చదువులు చెప్పేలా ఏర్పాటు చేశాడు. రోజుకు కొన్ని గంటల సేపటికే వేలు వేలు జీతం ఇచ్చాడు. 
 
కానీ పిల్లాడికి టీచర్ చదువులు చెప్పే గదిలోని సీసీటీవీ కెమెరా వీడియో చూసి.. అమిత్ షాకయ్యాడు. తన కుమారుడిని చితకబాదడాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీటీవీ ఆధారాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.