ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (12:04 IST)

టీచర్ స్నానం చేస్తుండగా వీడియో తీసిన విద్యార్థి.. రెండేళ్లుగా అదేపని..

తిరుచ్చిలో ఓ టీచర్ స్నానం చేస్తుండటాన్ని వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేసిన విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి, మనప్పారై, ఆవారంపట్టికి చెందిన జాన్సీ అనే మహిళ ఓ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో స్నానం చేస్తుండగా కిటికీల ద్వారా ఎవరో తొంగి చూసినట్లు జాన్సీకి కనిపించింది. దీంతో భయపడిన జాన్సీ అరవడంతో కిటీకల ద్వారా తొంగి చూసిన వ్యక్తి పారిపోయాడు. 
 
ఇటీవల జాన్సీ ఇంటికి ఓ లెటర్ వచ్చింది. అందులో స్నానం చేస్తుండగా వీడియో తీశానని.. చెప్పినట్లు వినని పక్షంలో ఈ వీడియోను నెట్లో పెట్టేస్తానని బెదిరించినట్లుంది. ఈ విషయాన్ని బయటచెప్తే వీడియోను నెట్టో పెట్టేస్తానని జాన్సీని ఆ లేఖ ద్వారా బెదిరించాడు. దీంతో షాక్ అయిన జాన్సీ ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు జాన్సీ పక్కింటి విద్యార్థి వద్ద విచారణ జరిపారు. 
 
ఈ విచారణలో జాన్సీ స్నానం చేయడాన్ని కిటికీల ద్వారా వీడియో తీశాడని.. రెండేళ్లుగా జాన్సీ స్నానం చేస్తుండటాన్ని కిటికీల ద్వారా తొంగిచూశానని తెలిపాడు. దీంతో ఆ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.