శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:04 IST)

నలుగురు అమ్మాయిల్ని దత్తత తీసుకుని.. 600 సార్లు...?

కెనడాలో దత్తపుత్రికలపై ఓ కామాంధ తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దత్తత తీసుకున్న అమ్మాయిలపై కామాంధుడు తన కోరికను తీర్చుకున్నాడు. ఒకసారి కాదు.. ఏకంగా 600 సార్లు అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కెనడాకు చెందిన ఓ వ్యక్తి నలుగురు అమ్మాయిలను దత్తత తీసుకుని పెంచుతున్నాడు. 
 
తొలుత తన దత్తపుత్రికలపై ప్రేమగా, ఆప్యాయంగా వుండిన ఆ తండ్రి.. తర్వాత తన బుద్ధిని చూపించాడు. అమ్మాయిలు పెరిగే కొద్దీ వారిని లైంగికంగా వేధించాడు. రోజూ ఆ నలుగురు అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దత్తత తీసుకుని తమపై పాడుపనికి పాల్పడే వ్యక్తిపై ఆ నలుగురు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ కామాంధుడిని అరెస్ట్ చేసి.. విచారణ జరిపారు. విచారణలో ఆ కామపిశాచి.. ఆ నలుగురు అమ్మాయిలపై 600 సార్లకు పైగా అత్యాచారం చేశాడనే.. షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడికి కఠినమైన శిక్ష పడే అవకాశం వుందని చెప్తున్నారు.