1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 7 మే 2025 (21:38 IST)

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Indian plane
పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం నెలకొన్నట్లు కనిపిస్తోంది. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై Operation Sindhoor పేరిట భారత దేశ ఆర్మీ మెరుపుదాడి చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో కరడుగట్టిన ఉగ్రవాదులు చచ్చినట్లు వార్తలు అందుతున్నాయి.
 
ఈ నేపధ్యంలో పాకిస్తాన్ దేశంలోని ప్రజలకు యుద్ధభయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వందలాదిమంది ప్రజలు బుధవారం నాడు ATMల ముందు బారులు తీరారు. అదేవిధంగా భారతదేశం చేసిన దాడులతో పాక్ స్టాక్ ఎంక్సేంజ్ కుప్పకూలింది. మరోవైపు భారతదేశ ఆర్మీ దాడుల నేపధ్యంలో సరిహద్దు ప్రాంతాలకు దగ్గరగా వున్న ప్రజలు ఆ ప్రాంతాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.