Daily Horoscope
✕

చావంటే భయంలేదు.. ఫ్లైట్‌ను కూల్చివేయాలన్నదే ప్లాన్ : ఫ్లైదుబాయ్ కో కెప్టెన్ వాంగ్మూలం

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 4 అక్టోబరు 2026 (21:13 IST)
తనకు చావంటే భయం లేదనీ, ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయాలన్న కుట్రతోనే కెప్టెన్ స్మిత్ మచ్చర్ దృష్టిమళ్లించి దాడి చేసినట్టు ఆ విమానం కో-పైలెట్ హమామ్ అల్ హమామీ చెప్పారు. ఈ మేరకు విచారణ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. ఫ్లైదుబాయ్ విమానం హైజాక్ యత్నం కేసులో కోపైలెట్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చివేయాలని ప్రయత్నించానని అంగీకరించాడు. చావంటే తనకు ఏమాత్రం భయం లేదని దర్యాప్తు అధికారులకు స్పష్టం చేశాడు. 
 
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళుతున్న ఎఫ్‌జెడ్ 1073 విమానంలో పైలెట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ఉద్దేశపూర్వకంగానే దారి మళ్లించి, ఆ తర్వాత తన పథకం ప్రకారం దాడికి పాల్పడినట్టు హమామ్ అంగీకరించాడు. ప్రార్థన చేసుకుంటానని చెప్ప కెప్టెన్ దృష్టి మరల్చి, విమానంలో గొడ్డలితో దాడికి యత్నించినట్టు తెలిపాడు. 
 
ఈ ఘటనపై ఇజ్రాయెల్ - సౌదీ అరేబియా దర్యాప్తు బృందాలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో గానీ, ఇరాన్‌తోగానీ ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. హమామ్ యూఏఈలో జన్మించాడు. ఆయన తండ్రి ఒమన్‌కు, తల్లి సిరియా దేశానికి చెందినవారు. ఫ్లైదుబాయ్‌లో చేరడానికి ముందు హమామ్ ఒమన్, సిరియా, మొరాకోలలో నివసించాడు. 
 
సిరియాలో ఎక్కువ కాలం జీవించినందున అక్కడి సుధీర్ఘ అంతర్యుద్ధం సమయంలో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అతని సోషల్ మీడియా ఖాతాల్లో వేలకొద్దీ ఉగ్రవాద సంబంధిత పోస్టులు, సందేశాలను అధికారులు గుర్తించారు. అయితే, ఈ కుట్ర వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయాన్ని మాత్రం అతను ఇంకా వెల్లడించేదు. ఈ కేసులో దర్యాప్తు లోతుగా సాగుతోంది. 
About Author
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

రోడ్డు దాటుతున్న అల్లు స్నేహారెడ్డికి తృటితో తప్పిన ప్రమాదం, వీడియో వైరల్

Rajendra Prasad : ఎం.ఎస్. నారాయణ మనవరాలి వివాహ వేడుక లో రాజేంద్రప్రసాద్ ఇలా...

Shah Rukh, Kareena : డాడీ కూల్ పాటతో ఆకట్టుకున్న కింగ్ నుంచి షారుఖ్ ఖాన్, కరీనా కపూర్

Kaaka for Sankranti: అటకెక్కిన విశ్వంభర; సంక్రాంతికి కాకాతో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు

కదులుతున్న రైలు ఏసీ కోచ్‌లో దీపం వెలిగించి అయ్యప్పకు పూజ, ప్రశ్నించిన చిన్మయిపై నెటిజన్ దూషణ

తర్వాతి కథనం
Show comments