గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 12 ఆగస్టు 2018 (12:05 IST)

జలపాతంలోకి స్నేహితురాలిని తోసేసింది.. పక్కటెముకలు విరిగిపోయాయ్

సరాదాగా విహార యాత్రకు వెళ్తే.. ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. స్నేహితుల వెంట వెళ్లిన పాపానికి పక్కటెముకలు విరిగిపోయాయి. వివరాల్లోకి వెళితే.. సరదాగా విహార యాత్రలకు అందరూ కలసి వెళితే, తన స్నేహితురాల

సరాదాగా విహార యాత్రకు వెళ్తే.. ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. స్నేహితుల వెంట వెళ్లిన పాపానికి పక్కటెముకలు విరిగిపోయాయి. వివరాల్లోకి వెళితే.. సరదాగా విహార యాత్రలకు అందరూ కలసి వెళితే, తన స్నేహితురాలిని అమాంతం జలపాతంలోకి తోసేసింది మరో యువతి.


ఈ ఘటన వాషింగ్టన్ సమీపంలోని యాక్టోల్ మౌల్టన్ జలపాతం వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
గత వారంలో ఓ స్నేహబృందం వాషింగ్టన్ సమీపంలోని యాక్టోల్ మౌల్టన్ జలపాతం వద్దకు వెళ్లింది. దాదాపు 60 అడుగుల పైనున్న బ్రిడ్జిపై నిలబడ్డ ఓ యువతి, జలపాతం అందాలను చూస్తుండగా, వెనకున్న మరో యువతి ఆమెను తోసేసింది. 
 
ఈ దుర్ఘటనలో నీటిలో పడిన యువతికి ఐదు పక్కటెముకలు విరిగిపోయాయి. ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.