సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (15:01 IST)

డోనాల్డ్ ట్రంప్ ఓ డైనోసార్.. ట్రంప్‌కు భారీ శరీరం, చిన్న తల, చేతులు ఉన్నాయ్: హాలీవుడ్ నటి హెలెన్ మిరెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందు నుంచి అనుకున్నట్లుగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు ఆయనను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందు నుంచి అనుకున్నట్లుగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు ఆయనను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కన్నా వెనకబడేలా చేసింది. నిజానికి రెండు నెలల క్రితం సీన్ ఇందుకు భిన్నంగా ఉండేది. 
 
మహిళలపై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బహిర్గతం కావడంతో చాలా మంది ప్రముఖులు ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. వీరిలో తాజాగా ఆస్కార్ అవార్డు విజేత, హాలీవుడ్ హీరోయిన్ హెలెన్ మిరెన్ కూడా చేరిపోయారు. హెలెన్ మిరెన్ ఆయనపై ఎవరూ ఊహించని విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌ను డైనోసార్‌గా అభివర్ణించారు. 
 
వాస్తవానికి డైనోసార్లు ఎప్పుడో అంతరించిపోయాయని… కానీ కొన్ని పాత డైనోసార్లు మాత్రం ఇంకా భూమి మీద మిగిలే ఉన్నాయని… వాటిలో ట్రంప్ ఒకడు అని ఎద్దేవా చేశారు. తన తాజా చిత్రం 'ఐ ఇన్ ద స్కై' ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


డైనోసార్ లాగానే ట్రంప్‌కు భారీ శరీరం, చిన్న తల, చేతులు ఉంటాయని చెప్పిన ఆమె డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కే తన మద్దతు ఉంటుందని తెలిపింది. అలాగే హిల్లరీ కోసం ఇటీవల చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు.