గురువారం, 2 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 29 సెప్టెంబరు 2022 (20:01 IST)

ఫ్లోరిడాను బలంగా తాకిన హరికేన్ ఇయన్.. తేలియాడుతున్న ఇళ్లు

Car
Car
అమెరికా ఫ్లోరిడా తీరాన్ని హరికేన్ 'ఇయన్' బలంగా తాకింది. కుండపోత వర్షాలు, 200 కిలోమీటర్లకుపైగా వేగంతో వీచిన భీకర గాలులతో తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 
 
ఈ హరికేన్ ధాటికి తీర ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. 20 మందితో కూడిన వలసదారుల పడవ మునిగిపోయింది. వారిలో కొందరిని రక్షించడం జరిగింది. 
 
యూఎస్‌లో రికార్డైన అత్యంత శక్తిమంతమైన తుపానుల్లో ఇదొకటని అధికారులు తెలిపారు. ఈ భయానక గాలుల వేగానికి లైవ్‌లో పరిస్థితి వివరిస్తున్న రిపోర్టర్లు కొట్టుకొని పోయినంతపనైంది. 
 
ఇళ్లు తేలియాడుతున్న దృశ్యాలు, నగర వీధుల్లోకి షార్క్‌లు కొట్టుకొని వచ్చిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. నేపుల్స్‌లో వరదనీరు ఇళ్లలోకి ఉప్పొగిందని, రోడ్లు మునిగిపోయి, వాహనాలు కొట్టుకుపోయినట్లు టీవీ దృశ్యాలు బట్టి తెలుస్తోంది.