గోదావరికి మరోసారి ప్రవాహ ఉద్ధృతి... 175 గేట్ల ద్వారా నీటి విడుదల
గోదావరికి మరోసారి ప్రవాహ ఉధ్ధృతి పెరుగుతోంది. జూలై, ఆగస్టు నెలల్లో వచ్చిన వరదలను మరవకముందే మరోసారి వరదలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలు, ఉపనదులకు వస్తున్న వరదతో గోదావరిలో క్రమంగా ప్రవాహం పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నీటి మట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అధికారులు తక్షణమే సహాయక చర్యలకు సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లు అలర్ట్ అయ్యారు. వర్షాలు, వరదలతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లేడు