బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (15:03 IST)

నీరవ్ మోదీకి బెయిల్ తిరస్కరణ.. భారత్‌కు అప్పగిస్తే మాత్రం చచ్చిపోతా?

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగనామం పెట్టి భారత్‌ నుంచి లండన్‌కు వెళ్లిపోయిన నీరవ్ మోదీకి యూకే కోర్టులో చుక్కెదురైంది. ఇప్పటికే నాలుగు సార్లు నీరవ్ మోడీ బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది కోర్టు. అయితే నేరస్తుల అప్పగింత కింద భారత్‌కు అప్పగించడంపై సవాల్‌ చేస్తూ నీరవ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. 
 
అయితే భారత్‌కు నీరవ్ మోదీని అప్పగించాలంటూ వాదనలు భారత్ తరపున వాదనలు వినిపిస్తుంది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్). అయితే భారత్‌కు తనను అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని నీరవ్ మోదీ బెదిరిస్తున్నాడని వారు వాదించారు. దీనిని బట్టి చూస్తేనే తప్పు చేసి తప్పించుకోవడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నాడో అర్థం అవుతుందని వాదించారు.
 
ఇదే క్రమంలో నీరవ్ మోడీ తరపు న్యాయవాది హ్యూగో కీత్, ఇద్దరు జైలు ఖైదీలు మోడీని బెదిరించారని, కొట్టారని కోర్టుకు వెల్లడించారు. 24 గంటల పర్యవేక్షణతో భద్రతను 2 మిలియన్ పౌండ్ల నుండి 4 మిలియన్ పౌండ్లకు పెంచాలని న్యాయవాది కోర్టుకు ప్రతిపాదించారు. మొత్తం వాదనలు విన్న కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించి వచ్చే ఏడాది మేలో తదుపరి విచారణ జరపనున్నట్లు చెప్పింది.