ధోనీ కెరీర్‌పై మీడియా ప్రశ్న.. నాకు తెలియదు బాస్ అన్న యువీ (వీడియో)

సెల్వి| Last Updated: మంగళవారం, 5 నవంబరు 2019 (18:11 IST)
టీమిండియా మాజీ సారథి ధోని భవితవ్యంపై అడిగిన ప్రశ్నకు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ముంబైలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధోనీ కెరీర్ గురించి తనకు తెలియదు బాస్ అంటూ సమాధానమిచ్చాడు. మన సెలక్టర్లు ఎప్పుడైనా కనిపిస్తే.. ఈ విషయాన్ని వారి వద్దే అడిగి తెలుసుకోండని ఝలక్ ఇచ్చాడు. ధోనీ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది సెలెక్టర్లే. తాను కాదని యువీ వ్యాఖ్యానించాడు.


మనకు మరింత మెరుగైన సెలెక్టర్ల అవసరం ఉందని యువరాజ్ తెలిపాడు. ఆధునిక క్రికెట్‌కు తగిన స్థాయిలో మన సెలక్టెర్లు లేరనేది తన అభిప్రాయమని చెప్పాడు. తాను ఎల్లప్పుడూ ఆటగాళ్లకు మద్దతుగానే ఉంటానని యువీ చెప్పాడు. ఆటగాళ్ల గురించి, జట్టు గురించి తప్పుగా మాట్లాడటం సరికాదని అన్నాడు. గాయాలపాలైనా లేదా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా భారత క్రికెటర్లు మ్యాచ్ ఆడక తప్పడం లేదన్నాడు. ఆడని పక్షంలో జట్టులో చోటు గల్లంతవుతుందనే ఆందోళనతో విధిలేని పరిస్థితుల్లో ఆటగాళ్లు మైదానంలోకి దిగుతున్నారని చెప్పుకొచ్చాడు.

మన సెలక్టర్ల బాధ్యత అంత సులువైనది కాదు. సెలక్టర్లు 15 మందిని ఎంపిక చేసిన తర్వాత ఇతర ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయలేదని చర్చలు జరుగుతాయి. అన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆటగాళ్లకు అండగా నిలవడంలో తాను ముందుంటానని వెల్లడించాడు.

దీనిపై మరింత చదవండి :