శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (12:18 IST)

తెలుగు వాడి పేరుతో కరాచీలో ఒక పేట

ప్రస్తుతం  పాకిస్థాన్ లో ఉన్న కరాచీ లో ఒక తెలుగువాడి పేరుతో పేట ఉంది. అదే పున్నయాపూర్. కోటంరాజు పున్నయ్య ,బాపట్ల లో  పుట్టి పత్రికా రంగంలోనే పనిచేయాలనే లక్ష్యంతో బొంబాయి వెళ్లి విద్యనభ్యసించి  పట్టభద్రుడు కాకున్ననూ ఆంగ్లంలో పట్టు సంపాదించి కాశీనాధుని నాగేశ్వరరావు గారి ఆదరణతో ఆంధ్రపత్రిక లో చేరారు. మద్రాస్ కు బదిలీ అయిన  తరువాత ఆంధ్రపత్రిక డైలీ ని ప్రారంభించి నడిపారు.

హ్యుమానిటీ అనే ఆంగ్ల పత్రిక కు సంపాదకునిగా పనిచేశారు ....అప్పుడే కరాచీ నుండి నడిచే న్యూ టైమ్స్ పత్రిక యాజమాన్యం దృష్టి పున్నయ్య గారి సంపాదకత్వాలపై పడింది ,వారి ఆహ్వానం మీద కరాచీ చేరి  'న్యూ టైమ్స్' సంపాదకుడిగా  బలహీనుల స్వరాన్ని బలం గా వినిపించారు.

కొద్ది రోజులకే 'సింధు ఆబ్సర్వర్ ' పత్రికకు మారి చివరివరక అక్కడే పనిచేశారు .బాపట్ల నుండి కరాచీ చేరిన పున్నయ్య గారు ధర్మం వైపు ,పేదలవైపు పోరాడి అక్కడే తుదిశ్వాస విడిచారు .తమ వాణి వినిపించిన ఆ మహామనీషి కి నివాళిగా అక్కడి ప్రజలు ఒక పేట కు 'పున్నయ్య పూర్ ' గా నామకరణం చేశారు