శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 డిశెంబరు 2021 (14:17 IST)

ఇండోనేషియాలో బద్ధలైన అతిపెద్ద అగ్నిపర్వతం : 13 మంది మృతి

ఇండోనేషియా దేశంలోని జావాలో అతిపెద్ద అగ్నిపర్వతం ఒకటి ఆదివారం బద్ధలైంది. దీంతో 13 మంది సజీవదహనమయ్యారు. ఈ అగ్నిప్రమాదం బద్ధలుకావడంతో అందులో నుంచి లావా ఏరులైపారుతోంది. సమీప గ్రామాల్లోకి లావా ప్రవేశించి బీభత్సం సృష్టిస్తోంది. దీంతో గ్రామస్తులంతా తమతమ ఇళ్లను ఖాళీ చేసి మేకలు, కోళ్లను పట్టుకుని పారిపోతున్నారు. ఈ అగ్నిపర్వతం సమీప గ్రామాలన్నీ పొగతో కమ్మేశాయి. 
 
ఈ ప్రమాదం తెలుసుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. ముఖ్యంగా లుమాజాంగ్ జిల్లాలో 11 గ్రామాలను బూడిద దట్టంగా కప్పేసింది. నివాసాలు, వాహనాలు, ఇతర నిర్మాణాలన్నీ బూడిదతో కప్పేసి కనిపిస్తున్నాయి. ఈ అగ్నిపర్వతం బద్ధలు కావడంతో సుమారు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మసీదుు, చర్చిలు, స్కూల్స్, కమ్యూనిటీ హాళ్లు తదితర చోట్ల ఆశ్రయం కల్పించారు.