గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (13:08 IST)

ఇరాన్‌లో ఘోరం- గాల్లోనే పేలిపోయిన విమానం.. 160 మంది మృతి.. 80 మంది సైనికులు కూడా?

ఇరాన్‌లో ఘోరం జరిగింది. బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి ఉన్న ఈ విమానం గాల్లోనే పేలిపోయింది. విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. సాంకేతిక సమస్యతోనే విమానం కుప్పకూలినట్లు ప్రాథమిక సమాచారం. ఇప్పటివరకు 160 మంది ప్రయాణీకులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ మీడియా వెల్లడించింది. 
 
ఇకపోతే.. ఇరాన్ అన్నంత పని చేస్తోంది. తమ మిలిటరీ కమాండర్‌ సులేమాని మృతికి దారుణమైన ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై 15 బాలిస్టిక్ క్షిపణులతో జరిపిన దాడులలో 80 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్లు ఇరాన్‌ మీడియా ప్రకటించింది. ఈ దాడుల్లో అమెరికా మిలిటరీ చాపర్లు, ఇతర సామాగ్రి ధ్వంసమైనట్లు తెలిపింది. ఇరాక్‌లోని అల్‌ అసద్‌, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై క్షిపణులతో ఇరాన్ దాడి చేసిందని తెలిపింది.
 
ఈ యుద్ద వాతావరణంలో ఇరాన్, ఇరాక్ దేశాల గగనతలం ద్వారా విమాన ప్రయాణాలు ప్రమాదకరమని అమెరికా తన విమానయాన సంస్థలను హెచ్చరించింది. ఈ విమానాల సర్వీస్‌లను రద్దు చేసింది. మరోవైపు భారత్ కూడా ఆ దేశాల మీదుగా విమాన ప్రయాణాలను రద్దు చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.