గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (12:53 IST)

ఒకే కాన్పులో ఏడుగురు... ఆరుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయి

సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరూ లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం సాధారణం. కానీ, ఇరాక్‌లో ఓ మహిళ ఏకంగా ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరంతా ఒకే కాన్పులో జన్మించారు. ఇందులో ఆరుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. 
 
ఇరాక్‌లోని దియాలీ ప్రావిన్స్‌లో ఉన్ ఓ ఆస్పత్రిలో 25 యేళ్ళ ఓ మహి ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళకు సాధారణ ప్రసవం కాగా, ఏడుగురి శిశువుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, తల్లీ కూడా క్షేమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
 
ఈ మహిళకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉండగా, వీరితో కలిపి మొత్తం 10 మంది అయ్యారు. ఒకే కాన్పులో ఏడుగురి పిల్లలకు జన్మనివ్వడం ఇరాకీలో ఇదే తొలిసారి కావొచ్చని వైద్యులు చెప్పారు.