ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 22 జనవరి 2019 (18:41 IST)

సీనియర్ అభిమానులను సత్కరించిన రెబల్ స్టార్-యంగ్ రెబ‌ల్ స్టార్

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు 79వ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌న‌వ‌రి 20వ తేదీన హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయ‌న స్వ‌గృహంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో 30 సంవ‌త్స‌రాలుగా త‌న అభిమానులుగా కొన‌సాగుతున్న 30 మంది సీనియ‌ర్ అభిమానుల‌ను కృష్ణంరాజు స‌త్క‌రించ‌డం విశేషం. 
 
ఉభ‌య రాష్ట్రాల రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యాన్స్ అసోసియేష‌న్ వ్య‌వ‌స్థాపక అధ్య‌క్షుడు జొన్న‌ల‌గ‌డ్డ శ్రీరామ‌చంద్ర శాస్త్రి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌కు చెందిన సీనియ‌ర్ ఫ్యాన్ గోవింద‌రావు, వ‌రంగ‌ల్‌కు చెందిన సీనియ‌ర్ ఫ్యాన్ క‌ట‌కం నాగ‌రాజు, శివాజీ, గుంటూరుకు చెందిన శాస్త్రిల‌తో పాటు షోలాపూర్, బ‌ళ్లారి, బెంగుళూర్ వంటి సుదీర్ఘ ప్రాంతాల నుండి వ‌చ్చిన 30 మంది సీనియ‌ర్ అభిమానుల‌ను కృష్ణంరాజు శాలువా, మెమోంటోల‌తో స‌త్క‌రించారు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని సీనియ‌ర్ అభిమానుల‌తో ఆప్యాయంగా ముచ్చ‌టించారు.