సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (11:24 IST)

నువ్వంటే నాకిష్టం.. ఐ లవ్ యూ : డైరెక్టర్‌కు సమంత విషెస్

అక్కినేని ఇంటి కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత ఓ దర్శకుడుకి ఐ లవ్ యూ చెప్పింది. పైగా నువ్వంటే నాకిష్టం అంటూ ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేశింది. అక్కినేని నాగచైతన్య భార్యగా ఉన్న సమంత ఇలాంటి ట్వీట్ ఎందుకు చేసిందో ఓసారి పరిశీలిద్ధాం. 
 
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'యూటర్న్'. ఈ చిత్రానికి పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో పవన్ సోమవారం తన పుట్టిన రోజును జరుపుకున్నాడు. 
 
ఈ సంద‌ర్భంగా స‌మంత సోష‌ల్ మీడియా ద్వారా ప‌వ‌న్‌ కుమార్‌కు మెసేజ్ పంపించింది. 'ప‌వ‌న్ కుమార్‌.. నేనెప్ప‌టికీ నీ అభిమానినే. ద‌ర్శ‌కుడిగా నువ్వంటే చాలా ఇష్టం. విడుద‌లైన నీ ప్ర‌తీ సినిమా చూస్తా. నువ్వు చాలా ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తివి. నీతో క‌లిసి పనిచేసినందుకు గ‌ర్వంగా ఉంది. ఐ ల‌వ్యూ మై ఫ్రెండ్' అని సమంత విషెస్ తెలియజేసింది.