మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 17 జనవరి 2019 (18:31 IST)

గర్భనిరోధక మాత్రలు ఎలాంటి మహిళలు వాడొచ్చు?

గర్భనిరోధక మాత్రలను బిడ్డలకు పాలిచ్చే తల్లులు అస్సలు వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల పాలు తగ్గిపోతాయట. బిడ్డలకు తల్లి పాలు ఎంతో ముఖ్యమన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ టాబ్లెట్ వాడటం వల్ల పాలు విషపూరితంగా మారుతాయట.
 
ఒకవేళ శృంగారంలో పాల్గొనాలనుకుంటే లూప్ వేయించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. లూప్ వేయించుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదట. స్త్రీ కాన్పు అయిన ఆరో వారం నుంచి శృంగారంలో పాల్గొనవచ్చట. గర్భనిరోధక మాత్రలు వాడటం కంటే లూప్ వేయించుకుంటే రెండుమూడు సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శృంగారంలో పాల్గొనవచ్చని వైద్యులు చెబుతున్నారు.