మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (10:38 IST)

హమాస్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... 3 వేల మంది మృత్యువాత

gaza strip
హమాస్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. గాజాస్ట్రిప్‌పై మంగళవారం రాత్రంతా ఇజ్రాయెల్ పైటర్ జెట్లు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో గాజాలో 1.80 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అలాగే మూడు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు, వైమానికి దాడులతో పాలస్తీనా గ్రూపు హమాస్‌ను భీకర దాడుల చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేయాలని భావిస్తుంది. మిలటరీ దాడులను ఉధృంతం చేసి హామాస్‌ను నామరూపాలు లేకుండా చేయనుంది. మరోవైపు, యుద్ధం కోసం రిజర్వు దళాలకు చెందిన మరింతమందిని పిలిపిచింది. 
 
గాజాలో ప్రతీకార వైమానిక దాడులతో కలిసి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య మూడు వేలకు దాటిందని ఇజ్రాయెల్ వర్గాలు పేర్కొంటున్నాయి. గాజా సరిహద్దు ప్రాంతమైన దక్షిణ ఇజ్రాయెల్‌ను హమాస్ ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఈ ప్రాంతంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు రోడ్లను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌ సైన్యం, ఆ దేశ ఫైటర్ జట్లు గాజాలో 200కు పైగా లక్ష్యాలపై రాత్రంతా బాంబుల వర్షం కురిపంచాయి. హమాస్ ఉగ్రవాదుల కేంద్రాలు సహా పలు భవాలను నేలమట్టం చేశాయి. ఇజ్రాయెల్ దళాలు కూల్చివేసిన గాజాలో హమాస్ సాయుధ విభాగం నేత మహ్మద్ దీప్ తండ్రి ఇల్లు కూడా ఉన్నట్టు పాలస్తీనా మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్ - హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న పోరు వల్ల ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం గాజాలో 1.80 లక్షల మంది నిరాశ్రయులైనట్టు సమాచారం.