మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 జులై 2018 (12:52 IST)

జపాన్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది.. వరదల్లో 100 మంది మృతి..

జపాన్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జపాన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. 2004 తర్వాత జపాన్‌లో మళ్లీ ఇంతటి తీవ్ర స్థాయిలో వరదలు సంభవించడం ఇదే తొలిసారని జపాన్ ప్రభుత్

జపాన్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జపాన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. 2004 తర్వాత జపాన్‌లో మళ్లీ ఇంతటి తీవ్ర స్థాయిలో వరదలు సంభవించడం ఇదే తొలిసారని జపాన్ ప్రభుత్వాధికారులు తెలిపారు. 
 
తాజాగా భారీ వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య వందకు చేరుకున్నట్లు జపాన్ సర్కారు వెల్లడించింది. వీరిలో 87 మందిని గుర్తించారు. అనేకమంది గల్లంతయ్యారు. దీంతో సహాయక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. 
 
గత గురువారం నుంచి జపాన్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లు నీటమునిగాయి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రంగంలోకి దిగిన జపాన్‌ సైన్యం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టింది. 
 
పడవల సాయంతో ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కొన్ని చోట్ల వంతెనలు కూలిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. సహాయకచర్యల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు.